డెంకడ, 20 July
కడెం మండల కేంద్రంలో అహ్మద్ గారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్.ఏ. మోటార్స్ (బజాజ్) షోరూమ్‌ను బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ భూక్యా జాన్సన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అహ్మద్ గారు జాన్సన్ నాయక్‌ను సత్కరించారు.
కడెం మండల కేంద్రంలో అహ్మద్ గారు ఏర్పాటు చేసిన ఎస్.ఏ. మోటార్స్ (బజాజ్) నూతన షోరూమ్‌ను బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ భూక్యా జాన్సన్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా షోరూమ్‌ను ప్రారంభించిన అనంతరం నిర్వాహకులు అహ్మద్ గారు భూక్యా జాన్సన్ నాయక్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. నూతన వ్యాపార సంస్థను ప్రారంభించిన అహ్మద్ గారికి జాన్సన్ నాయక్ గారు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ గారు మాట్లాడుతూ, కడెం ప్రాంతంలో నూతన వ్యాపార సంస్థలు స్థాపించబడటం స్థానిక ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ప్రజలకు నాణ్యమైన ద్విచక్ర వాహనాలు, మెరుగైన విక్రయ మరియు సేవా సదుపాయాలను అందిస్తూ ఎస్.ఏ. మోటార్స్ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి వ్యాపార సంస్థలు ఏర్పాటవడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రజలకు ఆధునిక సేవలు తమ ప్రాంతంలోనే అందుబాటులోకి రావడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












