Nizamabad/Kammarapally (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 14
గ్యాస్ సిలిండర్ల బుకింగ్, సరెండర్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఒక సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మరో సిలిండర్ కోసం 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు వేచి ఉండాలని స్పష్టం చేసింది. పీఎన్జీ కనెక్షన్ పొందిన 30 రోజుల్లోపు ఎల్పీజీ కనెక్షన్లను తప్పనిసరిగా రద్దు చేసుకోవాలని ఆదేశించింది.
గ్యాస్ సిలిండర్ల బుకింగ్, సరెండర్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఒక సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మరో సిలిండర్ కోసం 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది.
పీఎన్జీ కనెక్షన్ పొందిన 30 రోజుల్లోపు ఎల్పీజీ కనెక్షన్లను తప్పనిసరిగా రద్దు చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. కొత్త కనెక్షన్ కోసం కేవైసీ, ఆధార్, పాన్ వంటి గుర్తింపు, చిరునామా రుజువులు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు అవసరమని తెలిపింది.
కనెక్షన్ రద్దు చేసుకోవడానికి వినియోగదారుల పుస్తకం, ఆధార్, పాన్ వంటి ధృవపత్రాలతో పాటు రాతపూర్వక దరఖాస్తును సమర్పించాలని సూచించింది.












