విషయంలో (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 03
సాగర్ ఎడమ కాలువ పరిధిలో రెండు పంటలకు నీరు విడుదల చేయించి, రైతులను ఆదుకుంటామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడలో జరిగిన రైతు మహా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రైతాంగాన్ని ఆదుకుంటాం : జగదీష్ రెడ్డి మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) ప్రభుత్వంపై ఒత్తిడి చేసి సాగర్ ఎడమకాల పరిధిలో రెండు పంటలు నీరు విడుదల చేయించి, రైతులను ఆదుకుంటామని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడ లో జరిగిన రైతు మహా ధర్నాలో జగదీశ్ రెడ్డి హాజరై ప్రసంగిస్తూ సాగర్ ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ నీటి విడుదల జిల్లా మంత్రులు సోయి లేకుండావ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 510 అడుగుల నీరు ఉన్న సమయంలోనే సాగర్ ఎడమ కాలువ రెండు పంటలకు నీరు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. రైతుల శ్రేయస్సు కోసం 17 పంటలకు సాగునీరు ఇవ్వడం జరిగిందన్నారు. నీటి విడుదల నాడు కెసిఆర్ ఉద్యమ బాట చేపట్టారని, నేడు కేటీఆర్ సైతం రైతుల కోసం ప్రకటన చేయాలని, రైతులను కాపాడుకోవాలన్నారు. *1 రూపాయి నిధులు తేలేదు... నాటి కెసిఆర్ నిధులతోనే పనులు : భాస్కర్ రావు* మిర్యాలగూడ నియోజకవర్గంలో "1" రూపాయి కూడా నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రాలేదని, గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసిఆర్, కేటీఆర్ విడుదల చేసిన నిధులతోనే పనులు చేస్తున్నారని బిఆర్ఎస్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. రైతు మహా ధర్నాలో భాస్కర్ రావు ప్రసంగిస్తూ బిఆర్ఎస్ హయాంలోనే వేసిన రోడ్లపై కాంగ్రెస్ వారు నడుస్తున్నారని, నాటి మంచినీటి పథకాలతో నీరుతాగుతున్నారన్నారు. వీర్లపాలెం పవర్ ప్లాంట్ లో స్థానికులు ఉద్యోగులు ఇవ్వకుండా ఇతర ప్రాంతాల వారికి ఉద్యోగ అవకాశ కల్పిస్తున్నారని ఆరోపించారు. స్థానికులకు ఉద్యోగాలు ఇప్పించే సాగర్ ఎడమ కాలువ పరిధిలో పంటలకు నీరు విడుదల చేయించేంతవరకు రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని పేర్కొన్నారు.












