గద్వాల/కాగజ్ నగర్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 04
ఈ ఏడాది కృష్ణా నదికి వరదలు లేక జూరాల ప్రాజెక్టు వద్ద నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. కృష్ణా నది వెలవెలబోతుండగా, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత మాత్రం పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఏడాది వరదలు లేకపోవడంతో కృష్ణా నది వెలవెలబోతుండగా, ప్రాణహితకు మాత్రం జలకళ సంతరించుకుంది. ఎగువన వర్షాలు లేకపోవడంతో కృష్ణా నదికి వరదలు రాక ప్రాజెక్టు దిగువన ఇసుక, రాళ్లు తేలి కనిపిస్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన మొదలైంది.
గతేడాది మే 27 నుంచే జూరాలకు ఇన్ ఫ్లో ప్రారంభమైంది. అప్పటి వరకు 3.2 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. మే 29 నాటికి 7.78 టీఎంసీలకు చేరింది. అదే రోజు రాత్రి నుంచి లక్ష క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు కావడంతో ప్రాజెక్టు పది గేట్లను ఎత్తి దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని వదిలారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు మే 29 నుంచి వరద ప్రారంభమైంది. అప్పటి వరకు ప్రాజెక్టులో 39 టీఎంసీల నీరు ఉండగా.. జూన్ 3 వరకు వరద కొనసాగడంతో 70 టీఎంసీల నీరు వచ్చి చేరింది. దీంతో జూన్ మొదటి వారం నుంచి అధికారులు లిఫ్టులను ప్రారంభించి, జూరాల పరిధిలోని భీమా లిఫ్ట్-1, లిఫ్ట్-2, కోయిల్‌సాగర్, లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్, ఆర్డీఎస్ ప్యార్లల్ కెనాల్స్‌కు నీటిని వదిలారు.
మరోవైపు, మహారాష్ట్రలో వర్షాలతో ప్రాణహిత పరవళ్లు తొక్కుతోంది.












