కుంటాల, జూలై 2
రైతుల నుంచి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి, కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన కుంటాల మండల తహసీల్దార్ ఆడే కమల్ సింగ్కు బీజేపీ నాయకులు ఘన సన్మానం నిర్వహించారు. రైస్ మిల్లులకు పంటను వేగంగా తరలించడం, నగదు సకాలంలో ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవడం వంటి ఆయన సేవలను నాయకులు కొనియాడారు.
రైతుల నుంచి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన కుంటాల మండల తహసీల్దార్ ఆడే కమల్ సింగ్కు బీజేపీ నాయకులు ఘన సన్మానం నిర్వహించారు.
మండలంలో PACS, IKP ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి, మక్కలు, జొన్నల కొనుగోలు కేంద్రాల్లో రైతుల పంటను సరైన సమయంలో కొనుగోలు చేయడంతో పాటు, రైస్ మిల్లులకు వేగంగా తరలించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారని నాయకులు కొనియాడారు. రైతులకు చెల్లించాల్సిన నగదు సకాలంలో వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ నిరంతరం పర్యవేక్షణ చేసిన తహసీల్దార్ కమల్ సింగ్ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పసుల నవీన్, సింధే దత్తు పటేల్ తహసీల్దార్ ఆడే కమల్ సింగ్ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేసిన అధికారులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు.
సత్కారానికి స్పందించిన తహసీల్దార్ ఆడే కమల్ సింగ్ మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడం తన విధి అని అన్నారు. అధికారులు, PACS, IKP సిబ్బంది, మిల్లర్లు, రైతుల సహకారంతో కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తైందని తెలిపారు. భవిష్యత్తులో కూడా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో PACS, IKP ప్రతినిధులు, రైతులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.












