నిర్మల్, జూలై 2
జిల్లాలో నిర్దేశించిన లక్ష్యానికి మించి ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో నిర్దేశించిన లక్ష్యానికి మించి ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు నిర్దేశించిన 1,600 ఎకరాల లక్ష్యాన్ని అధిగమించేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో రైతులకు వివరించి, ఇతర పంటలతో పోలిస్తే పెట్టుబడి, శ్రమ, సాగునీటి వినియోగం, దిగుబడి, ఆదాయం వంటి అంశాలపై అవగాహన కల్పించాలని చెప్పారు.
వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ, మండలాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రమణతో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












