బోరజ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
భూగర్భ జలాలను పెంపొందించి, కరువు పరిస్థితులను అధిగమించి, భావితరాలకు నీటి కొరత లేకుండా చేయడమే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలసిరి పథకం ప్రధాన లక్ష్యమని జిల్లా పరిషత్ ప్రధాన కార్యనిర్వహణ అధికారి, బోరజ్ మండల ప్రత్యేక అధికారి రవికుమార్ అన్నారు. గురువారం బోరజ్ మండలంలోని గీమ్మ గ్రామంలో నిర్వహించిన జలసిరి గ్రామసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భూగర్భ జలాలను పెంపొందించి, కరువు పరిస్థితులను అధిగమించి, భావితరాలకు నీటి కొరత లేకుండా చేయడమే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలసిరి పథకం ప్రధాన లక్ష్యమని జిల్లా పరిషత్ ప్రధాన కార్యనిర్వహణ అధికారి, బోరజ్ మండల ప్రత్యేక అధికారి రవికుమార్ అన్నారు.
గురువారం బోరజ్ మండలంలోని గీమ్మ గ్రామంలో నిర్వహించిన జలసిరి గ్రామసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు, మహిళలు, గ్రామీణ కూలీలకు ఉపాధితో పాటు శాశ్వత ఆస్తుల కల్పన జరుగుతుందని తెలిపారు.
వ్యవసాయ శాఖ అధికారి మహమ్మద్ అష్రఫ్ అహ్మద్ మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తగా నీటి కుంటలు, వ్యవసాయ కుంటలు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీంతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఆరుతడి పంటలు, కూరగాయల సాగు ద్వారా ఆదాయం పెంచుకోవచ్చని వివరించారు.
మండల అభివృద్ధి అధికారి నర్సింగ్‌రావు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని కాపాడుతూ ప్రతి ఇంటి ముందు రెండు మొక్కలు నాటాలని కోరారు. జలసిరి పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మండల సహాయ పథక అధికారి మాధవ్ మాట్లాడుతూ మహిళలు వ్యవసాయ కుంటలు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని పెరటి తోటల్లో కూరగాయల సాగు ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల సదుపాయాన్ని వినియోగించుకుని స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే ఒక ఎకరం మునగ తోట సాగు చేపట్టే మహిళలకు ఉపాధి హామీ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలలో చేరి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించుకోవాలని పిలుపునిచ్చారు.
మండలంలోని గీమ్మ, కామాయి, మాంగుర్లగూడ గ్రామాల్లో జలసిరి గ్రామసభలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు ప్రత్యూమ్య, రఘు, వికాస్, వ్యవసాయ విస్తరణ అధికారి శివప్రసాద్, దీప్తి, ప్రణీత్ ప్రసాద్, ఉపాధి హామీ సహాయ పథక అధికారి వినోద్, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సిబ్బంది గంగారాం, హేమలత, మహిళా సంఘ సభ్యులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.












