తానూర్, జూలై 23
బోంద్రట్ గ్రామంలో 'తెలంగాణ జలసిరి' కార్యక్రమంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాల సంరక్షణ, వర్షపు నీటి సద్వినియోగంపై రైతులకు అధికారులు వివరించారు.
బోంధ్రట్ గ్రామంలో 'తెలంగాణ జలసిరి' కార్యక్రమంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పంటల సాగు, ఇంకుడు గుంతల ఏర్పాటు, ఊట గుంతల నిర్మాణం, బోరు బావుల రీచార్జి ద్వారా భూగర్భ జలాల సంరక్షణపై సంబంధిత అధికారులు అవగాహన కల్పించారు.
జలసిరి కార్యక్రమం ద్వారా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకొని భూగర్భ జలాలను పెంపొందించవచ్చని వివరించారు. రైతులు నీటి సంరక్షణ చర్యలను తప్పనిసరిగా చేపట్టి వ్యవసాయానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎం శివలింగయ్య, పంచాయతీ కార్యదర్శి తిరుపతి రెడ్డి, టీపీఓ శేఖర్, ఇకేసీ సీపీ రాణి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.












