హైదరాబాద్, జులై 09
హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సతమరాయి సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి బస్టాండ్‌లో వేచి ఉన్న మహిళలపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మందికి గాయాలయ్యాయి.
హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో వాహనం అదుపుతప్పి బస్టాండ్‌లో వేచి ఉన్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మరణించగా.. మరికొందరికి గాయాలయ్యాయి.
గురువారం తెల్లవారుజామున సతమరాయి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న బొలెరో వాహనం, ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి బస్టాప్‌లో వేచి ఉన్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. మరికొందరికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా.. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ ఏరియాలో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు బొలెరో వాహనాన్ని పక్కకు తప్పించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












