నిర్మల్, 1 July
నిర్మల్ జిల్లా కొండాపూర్ హైవే పరిధిలోని ఎల్లాపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బంధువుల ఇంటి నుంచి స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న వృద్ధురాలు చిట్యాల రాజవ్వ (60) రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా కొండాపూర్ హైవే పరిధిలోని ఎల్లాపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న చిట్యాల రాజవ్వ (60) రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజవ్వ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎస్సై లింబద్రి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.












