అమరావతి, జూన్ 30
తెలంగాణలోని భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త బసని నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నాగేశ్వరరావుకు ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న తెలంగాణ రాష్ట్రం భద్రాద్రికొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురంనకు చెందిన బసని నాగేశ్వరావును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సీనియర్ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్న విషయం తన దృష్టికి రావడంతో సీఎం చంద్రబాబు ఫోన్ చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగేశ్వరరావుతో మాట్లాడారు.
ప్రమాదం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు, అధైర్య పడొద్దని... తానున్నానంటూ భరోసా ఇచ్చారు. అలాగే ఆయన కుమారుడు నవీన్‌తో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. తన తండ్రికి తీవ్ర ప్రమాదం జరిగిందని, తలకు 52 కుట్లు పడ్డాయని సీఎం చంద్రబాబుకు నవీన్ వివరించారు.
నాగేశ్వరరావు చికిత్సకు అయ్యే ఖర్చులు పార్టీ భరిస్తుందని, భయపడొద్దని సీఎం ధైర్యం చెప్పారు.












