నిర్మల్, 12 July
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని రంజని తండాలో ఆగి ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి నిమిషాల్లోనే దగ్ధమైంది. తండావాసులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని రంజని తండాలో ఆగి ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన తండావాసులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. క్షణాల్లోనే మంటలు కారంతా వ్యాపించడంతో వాహనం దగ్ధమైంది. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.












