- ఫిబ్రవరి 27న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
- 46 పోలింగ్ కేంద్రాలకు 224 మంది పోలీస్ అధికారులు భద్రత క్రమంలో నియామకం
- 144 సెక్షన్ అమలు – పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు
- ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల నేతృత్వంలో ఎమ్మెల్సీ ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో సమీక్ష జరిగింది. ఫిబ్రవరి 27న జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి 46 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీటికి 224 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారని ఎస్పీ వెల్లడించారు.
ఫిబ్రవరి 27న జరుగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి, జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో శాంతి భద్రతలు పక్కాగా అమలు కావాలని ఆమె సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 46 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 12 పట్టభద్రులు, 4 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. శాంతి భద్రతల కోసం 224 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNSS ఆక్ట్ (144 సెక్షన్) అమల్లో ఉంటుందని, 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించినట్లు ఎస్పీ తెలిపారు. ఎన్నికల నియమాలను ఉల్లంఘించిన వారికి చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎన్నికల సమయంలో ఎవరైనా గందరగోళం సృష్టిస్తే, వెంటనే డయల్ 100కి సమాచారం ఇవ్వాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఉపేంద్ర రెడ్డి, అవినాష్ కుమార్ ఐపీఎస్, రాజేష్ మీన ఐపీఎస్, ఇన్స్‌పెక్టర్లు, ఎస్‌ఐలు, ఆర్ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.