జగిత్యాలలో విచిత్ర ఘటన ….

జగిత్యాలలో విచిత్ర ఘటన ....

జగిత్యాలలో విచిత్ర ఘటన ….

మంచి భార్యా పిల్లలను వదిలేసి ఓ ట్రాన్స్ జెండర్‌తో సహజీవనం చేస్తున్న యువకుడు

జగిత్యాల జిల్లాలో ఒక అశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఇద్దరు పిల్లల తండ్రి అయిన వ్యక్తి, తన భార్యను వదిలేసి ట్రాన్స్ జెండర్‌తో సహజీవనం చేసస్తున్నాడు. జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్‌కు సారంగాపూర్ మం. పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యతో 2014లో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవలి కాలంలో రాజశేఖర్, హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్ జెండర్‌ దీపు తో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ నేపథ్యంలో భార్య లాస్యను వదిలి, దీపుతో సహజీవనం ప్రారంభించాడు. ఈ విషయం తెలిసిన భార్య లాస్య, మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. లాస్య ఆసుపత్రిలో ఉన్నప్పటికీ రాజశేఖర్ హాస్పిటల్ కు రాకపోవడంతో ఆందోళన కు గురైన అత్తమామలు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో తన ఇంట్లోనే ట్రాన్స్ జెండర్ దీపుతో కలిసి ఉన్న రాజశేఖర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూమ్ కు తాళం వేసి తదనంతరం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు రాజశేఖర్, దీపు లను స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు. కాగా స్థానికంగా ఈ విషయం చర్చనీయంశంగా మారింది

Join WhatsApp

Join Now

Leave a Comment