మానవత్వానికి చిరునామా గర్జనపల్లి యువకులు
మానసిక వికలాంగ కుటుంబానికి రూ.36,342 నగదు, 25 కిలోల బియ్యం సాయం
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన జోగుల మనోహర్ అనే యువకుడు ఇటీవల మతిస్థిమితం లేకుండా తిరుగుతూ అనారోగ్యం బారినపడి, స్వగ్రామంలోని పంట పొలంలో ప్రాణాలు కోల్పోయాడు. గతంలోనూ అతని తమ్ముడు ఇదే విధంగా మానసిక అనారోగ్యంతో చనిపోయాడు. ఇక తల్లి కూడా మతిస్థిమితం లేకుండా ఉంటే, వృద్ధాప్యంలో ఉన్న తండ్రి చంద్రయ్య పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయాడు.
ఈ విషాద పరిస్థితిని గమనించిన గర్జనపల్లి, జవహర్లాల్ నాయక్ తండా, సీతారాం నాయక్ తండాలకు చెందిన గ్రామ యువకులు మానవతావాదిగా స్పందించారు. చంద్రయ్య కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించి, అందరూ కలిసి సాయం సేకరించారు. మొత్తం రూ.36,342 నగదుతో పాటు 25 కిలోల బియ్యంను ఆ కుటుంబానికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు గజ్జెల ప్రశాంత్, అజ్మీరా నవీన్, నగరపు దేవేందర్, చిన్నం దేవేష్, ఎలగందుల చిరంజీవి, జోగుల నరేష్, జోగుల కాంతయ్య మంజుల, అజ్మీరా గణేష్, వినయ్, తిరుపతి, న్యాత మోహన్, చంద్రయ్య, నవత తదితరులు పాల్గొన్నారు.
ఇది ఒక్క గ్రామంలో జరిగిన ఘటన కాదు – ఇది మానవతా విలువలకి నిలువెత్తు నిదర్శనం.