ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా మృతికి ఆశ్రు నివాళులు.

ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా మృతికి ఆశ్రు నివాళులు.

.మల్కాజిగిరి సిఐటియు మండల కార్యదర్శి బంగారు నర్సింగ్ రావు

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి )

మల్కాజిగిరి : అక్టోబర్ 14

. ప్రొఫెసర్: జిఎన్. సాయిబాబా గారి భౌతికయానికి నివాళులు బంగారు నర్సింగ రావు అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు మల్కాజ్గిరి మండల కార్యదర్శి. మాట్లాడుతూ… దేశం గర్వించదగ్గ ఒక గొప్ప మేధావిని కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రముఖ విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త, ప్రముఖ రచయితగా, గుర్తింపు పొందిన ప్రొఫెసర్: జి ఎన్ సాయిబాబా. (ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ )గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. ప్రొఫెసర్ సాయిబాబా గారిపై మావోయిస్టులతో, నక్సలైట్ తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఉఫా చట్టం కింద అక్రమ కేసులు పెట్టి నిర్బంధించారు. గడ్చిరోలి జిల్లా స్పెషల్ కోర్టులో 2017 లో జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పుపై సాయిబాబా గారు బొంబాయి హైకోర్టుకు అప్పీల్ చేయడం జరిగింది. దీన్ని విచారించిన కోర్టు 2022లో నిర్దోషిగా ప్రకటించి కేసు కొట్టు వేసి విడుదల చేయడం జరిగింది. సాయిబాబా గారు నాగపూర్ సెంట్రల్ జైల్లో 9 ఏళ్ళు కఠిన కారాగారా శిక్ష అనుభవించారు. 90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబా సరైన వైద్య సౌకర్యాలు లేక జైలు గోడల మధ్య తీవ్రమైన అనారోగ్య పాలయ్యారు. తనకు మెరుగైన వైద్యం అందించాలని కోర్టుకు అనేక దఫాలుగా విన్నవించుకున్న స్పందించిన దాఖలు లేవు. సమాజంలోని అంతరాలను, సామాజిక వివక్షను రాజ్యం యొక్క నైజాన్ని ప్రశ్నించినందుకు సాయిబాబా గొంతు నొక్కి కుట్రలు చేసి ఉఫా చట్టం ప్రయోగించింది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం. సాయిబాబా మరణానికి కేంద్రమే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.. రాజ్య హింస పెరిగినప్పుడు సాయిబాబా అలాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు. రాజ్య వ్యవస్థ వ్యక్తులను చంపవచ్చు కానీ వారి ఆశయాలను చంపలేదని పేర్కొన్నారు. అక్రమ కేసులు, నిర్బంధాలు ప్రయోగించి ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కాలని చూస్తున్న రాజ్యాన్ని ప్రజాస్వామికవాదులు, సామాజిక ఉద్యమ కార్యకర్తలు, వామపక్ష మేధావులు, ప్రజలందరూ ప్రశ్నించాలన్నారు. ప్రజా క్షేత్రంలో సమస్యల పరిష్కారం కోసం చేసే ఆందోళన, పోరాటాలే ప్రొఫెసర్ : జి ఎన్ సాయిబాబా నిజమైన నివాళులు అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment