ట్రాక్టర్ ప్రమాదంలో మహిళ మృతి

ట్రాక్టర్ ప్రమాదంలో మహిళ మృతి

మనోరంజని తెలుగు టైమ్స్ – సారంగాపూర్, డిసెంబర్ 08

సారంగాపూర్ మండలం చించొలి (బి) గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన దుర్ఘటనలో ఒడిశా రాష్ట్రానికి చెందిన మహిళ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం— మృతురాలు భానుమతి (30), ఆమె భర్త జగమండ్‌తో కలిసి గత మూడు సంవత్సరాలుగా చించొలి (బి) గ్రామంలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో, భర్త జగమండ్ నడుపుతున్న ట్రాక్టర్‌పై ప్రయాణిస్తుండగా, అతడు వాహనాన్ని అతివేగంగా నడపడం, నిర్లక్ష్యంగా బ్రేకులు వేయడం వల్ల భానుమతి ట్రాక్టర్‌ నుంచి కిందపడింది. తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment