ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న యువకుడు మృతి

ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న యువకుడు మృతి

మనోరంజని తెలుగు టైమ్స్ – సారంగాపూర్

ఆదిలాబాద్ జిల్లా నేరడికొండ గ్రామానికి చెందిన అల్వే చరణ్‌ (25) అనుమానాస్పదస్థితిలో మరణించాడు. సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్ దగ్గరలో అతను మృతదేహంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చరణ్ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అలాగే పెళ్లి సంబంధాలు కుదరడం లేదన్న నిరాశతో ఉన్నాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నిన్న మధ్యాహ్నం “నిర్మల్‌కి వెళ్తాను” అని ఇంటి నుంచి బయలుదేరి వెళ్లి తిరిగి రాలేదని అతని అన్న సాయికుమార్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సూచన అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment