సారంగాపూర్ NCSF చక్కెర పరిశ్రమను వెంటనే తెరిపించండి – చెరుకు ఉత్పత్తి దారుల డిమాండ్

Alt Name: SarangaPur NCSF Sugar Factory

 

  • సారంగాపూర్ NCSF చెక్కర పరిశ్రమ పునరుద్ధరణ డిమాండ్
  • రైతుల పక్షాన ఎత్తు ఆందోళనలు జరుపుతామని హెచ్చరిక
  • కాంగ్రెస్ ప్రభుత్వం పై వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

 Alt Name: SarangaPur NCSF Sugar Factory

 సారంగాపూర్ NCSF చెక్కర పరిశ్రమను వెంటనే తెరిపించాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్లు ఆకుల పాపయ్య, పృథ్వి రాజ్ డిమాండ్ చేశారు. 2008లో మూతపడిన ఈ పరిశ్రమను తెరిపించాలని రైతులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చక్కెర పరిశ్రమ పునరుద్ధరణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించకపోతే, పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

: చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్లు ఆకుల పాపయ్య, పృథ్వి రాజ్, సారంగాపూర్ NCSF చెక్కర పరిశ్రమను వెంటనే తెరిపించాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నవిపేట్ మండలంలోని రైతు భవన్‌లో జరిగిన చెరుకు రైతుల సమావేశంలో వారు ఈ విషయం ప్రస్తావించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 1962లో 23 వేల మంది సభ్యులతో స్థాపించబడిన ఈ పరిశ్రమ వేలాది కుటుంబాలకు ఆర్థిక పరంగా అండగా నిలిచిందని గుర్తు చేశారు. 2008లో గత ప్రభుత్వాల తప్పుడు విధానాల కారణంగా ఈ పరిశ్రమ మూతపడినప్పటి నుండి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.

కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే చెక్కెర పరిశ్రమలను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారని, అయినప్పటికీ సారంగాపూర్ NCSF పరిశ్రమపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని వారు ఆరోపించారు.

చెరుకు రైతులు తమ చెరుకును ప్రాసెస్ చేయడానికి పరిశ్రమను తెరిపిస్తే, రైతులు వెంటనే పంట సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పరిశ్రమను పునరుద్ధరించి, కార్మికులకు మరియు రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో AIKMS జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, పృథ్వి రాజ్, FPO చైర్మన్ మచ్చర్ల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment