పెద్దపల్లి జిల్లా | ఫిబ్రవరి 07
🔹 మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఆర్టీసీ మహిళా కండక్టర్, డ్రైవర్‌పై దాడి
🔹 సెంటినరీ కాలనీలో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు
🔹 నిందితులు గుండారం గ్రామానికి చెందిన రాచకొండ రవి, మోతె రాజయ్య
🔹 చట్ట వ్యతిరేక చర్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చంద్రకుమార్ హెచ్చరిక
పెద్దపల్లి జిల్లా బేగంపేట్ సమీపంలోని సెంటినరీ కాలనీలో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఓ ఆర్టీసీ బస్సును అడ్డుకుని మహిళా కండక్టర్, డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు.
పెద్దపల్లి నుండి మంథని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి 9 గంటల సమయంలో తెలంగాణ చౌరస్తా, సెంటినరీ కాలనీ వద్దకు చేరుకుంది. ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న రాచకొండ రవి, మోతె రాజయ్య అనే ఇద్దరు వ్యక్తులు తమ కారును ర్యాష్‌గా నడుపుతూ బస్సుకు అడ్డంగా పెట్టారు.
బస్సు డ్రైవర్ కారును పక్కకు పెట్టాలని కోరగా, నిందితులు వాగ్వాదానికి దిగారు. అనంతరం మహిళా కండక్టర్‌పై దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలంతో మాట్లాడారు. స్థానికులు ఘటనను గమనించి నిందితులను అడ్డుకున్నారు.
🔸 బాధిత మహిళా కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై కేసు నమోదు చేశారు.
🔸 కమాన్‌పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన రాచకొండ రవి, మోతె రాజయ్యలపై పోలీసులు చర్యలు చేపట్టారు.
🔸 ఎవరైనా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చంద్రకుమార్ హెచ్చరించారు