తల్లాడ: డెంగ్యూ జ్వరంతో యోగా టీచర్ మృతి
డెంగ్యూ జ్వరంతో యోగా టీచర్ మృతి చెందిన ఘటన తల్లాడలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం. తల్లాడ మండల కేంద్రానికి చెందిన కందుల శ్రీదేవి (32) గత కొద్దిరోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి భర్త, కుమార్తె ఉన్నారు