M4 న్యూస్, నిర్మల్ జిల్లా (ప్రతినిధి), అక్టోబర్ 5
- యాటకారి సాయన్న 72వ సారి రక్త దానం.
- చిట్యాల గ్రామానికి చెందిన లక్ష్మవ్వ ప్రాణాలను కాపాడిన సాయన్న.
- యువత రక్తదానం చేయాలని పిలుపు.
నిర్మల్ పట్టణానికి చెందిన యాటకారి సాయన్న ఆపద సమయంలో 72వ సారి రక్తదానం చేసి చిట్యాల గ్రామానికి చెందిన కామెండి లక్ష్మవ్వకు ప్రాణం కాపాడారు. బీ పాజిటివ్ రక్తం అవసరమని తెలియగానే ఆయన హుటాహుటిన రక్తదానం చేశారు. సాయన్న రక్తదానం చేయడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చని యువతకు పిలుపునిచ్చారు.
నిర్మల్ పట్టణానికి చెందిన లయన్ యాటకారి సాయన్న ముదిరాజ్, 72వ సారి రక్త దానం చేసి మరోసారి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. చిట్యాల గ్రామానికి చెందిన కామెండి లక్ష్మవ్వకు అత్యవసర ఆపరేషన్ కోసం బీ పాజిటివ్ రక్తం అవసరమని తెలిసిన వెంటనే, సాయన్న తక్షణమే రక్తదానం చేసి ఆమె ప్రాణాలను కాపాడారు.
సాయన్న ప్రస్తుతం నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా మరియు ఎన్సీసీ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చని, రక్త శుద్ధి కూడా జరుగుతుందని యువతను రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రక్తదాన గ్రూప్ ప్రమోద్, సుంకరి సాయి, ఆకుల కార్తీక్, మన్సూర్, సుధాకర్, రాకేష్, సుమతి, భోజవ్వ తదితరులు పాల్గొన్నారు.