ఎడ్ల బండిపై వాగుదాటుతుండగా వృద్ద మహిళ మృతి

ఎడ్ల బండిపై వాగుదాటుతుండగా వృద్ద మహిళ మృతి

ఎడ్ల బండిపై వాగుదాటుతుండగా వృద్ద మహిళ మృతి

ఘటన స్థలాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల

మనోరంజని ప్రతినిధి నిర్మల్ ! భైంసా రూరల్ సెప్టెంబర్ 22

భైంసా మండల పరిధిలోని మాటేగాం గ్రామానికి చెందిన సురేష్, భిజ్జూర్ గ్రామానికి చెందిన తన యజమాని నగేష్ రెడ్డి సూచనల మేరకు వ్యవసాయ పనుల నిమిత్తం ఎడ్లబండి, బర్రెతో పొలాలకు వెళ్తున్నాడు. ఈ సందర్భంగా మార్గమధ్యంలో గంటోళ్ళ లక్ష్మీ భాయి (65) అనే వృద్ధ మహిళ, నేను కూడా అదే వైపు వెళ్తున్నాను అని ఎడ్లబండిపై ఎక్కి ప్రయాణించింది. భిజ్జూర్ నుండి బాబూల్‌గాం వెళ్ళే మార్గంలో వాగు దాటుతున్న సమయంలో ఎడ్లబండి, బర్రె నీటిలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి మృత్యువాత పడ్డాయి. అదే సమయంలో ఎడ్లబండిలో ఉన్న వృద్ధ మహిళ లక్ష్మీ భాయి కూడా ప్రవాహంలో కొట్టుకుపోయి మరణించగా, సురేష్ మరియు ఒక ఎద్దు బయటపడ్డాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల స్వయంగా వాగు ప్రాంతాన్ని సందర్శించి, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ వర్షాల కారణంగా అనవసరంగా ఎవరు కూడా బయటకు రావొద్దని, వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయరాదని, ముఖ్యంగా వ్యవసాయ రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఘటన సందర్శనలో భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్, ఇన్స్పెక్టర్ నైలు, సమ్మయ్య, ఎస్ఐ, సిబ్బంది ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment