పెద్దపల్లి: విష జ్వరంతో మహిళ మృతి
రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన 37 ఏళ్ల చిందం శారద విష జ్వరంతో మృతి చెందారు. పది రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న ఆమెకు పలు ఆసుపత్రులలో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చివరికి కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా, విష జ్వరంతో పాటు ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడంతో ఆమె ఈరోజు ఉదయం ప్రాణాలు విడిచారు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తెలిపారు