భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన భార్య
కుటుంబ కలహాలతో గత 2 నెలల నుంచి పుట్టింట్లో ఉంటున్న తన భార్యను తిరిగి తీసుకురావడానికి పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు వెళ్లిన 50 ఏళ్ల రమణయ్య మంగళవారం హత్యకు గురయ్యారు. మృతదేహాన్ని అతడి భార్య రమనమ్మ తన సోదరుడితో కలిసి రాత్రి వేళ కారులో తీసుకొచ్చి నంద్యాల జిల్లా నూనెపల్లెలోని రమణయ్య ఇంటి వద్ద పడేశారు. ఈ ఘటనపై నంద్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు