- సివైఎస్ఎస్ జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ శీతాల్కర్ అరవింద్ డిమాండ్
- విద్యాధికారి నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు
- ఫిర్యాదులు ఉన్నా విచారణ జరపనట్లుగా ఆరోపణ
నిర్మల్ జిల్లా కుబీర్ మండల విద్యాధికారిపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరిగిందని, ఆయన నిర్లక్ష్యం, అవినీతి కారణంగా ప్రభుత్వ పాఠశాలలు నాశనమవుతున్నాయని, విద్యార్థుల భవిష్యత్తు అడ్డుకుపడుతోందని సివైఎస్ఎస్ జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ శీతాల్కర్ అరవింద్ అన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ కు ఫిర్యాదు చేసి, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
: నిర్మల్ జిల్లా కుబీర్ మండల విద్యాధికారిపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందని, ఆయన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అవినీతి కి పాల్పడుతున్నారని సివైఎస్ఎస్ జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ శీతాల్కర్ అరవింద్ ఆరోపించారు. సోమవారం జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ అభిలాష అభినవ్ ను కలిసి కుబీర్ మండల విద్యాధికారిపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తుతో ఆఫీసర్ చెలగాటమాడుతున్నాడని ఆరోపించారు.
సౌనా పార్డి(కే) పాఠశాలలో ఏకోపాధ్యాయులను విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని, అదే సమయంలో బిట్ కాయిన్ దందా వ్యవహారాలను పాఠశాల అభివృద్ధి నుంచి ప్రక్కన పెడుతున్నారని, విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.