దళితులపై ఇంత వివక్ష ఎందుకు

#దళితహక్కులు #కాంగ్రెస్ #నిర్మల్

అధిష్టానాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులు
కాంగ్రెస్ లో పని చేయని వారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులా!
మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పై నారాయణరావు పటేల్ వర్గీయుల మండిపాటు

ఎమ్4 న్యూస్ ( ప్రతినిది )

భైంసా : అక్టోబర్ 25

నిర్మల్ జిల్లా కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దళితులకు కేటాయిస్తే ఏడు సంవత్సరాలుగా నియమించకపోవడం ఏంటని, అప్పటి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సైతం జాప్యం చేశారని దళితులు అంటే ఇంత చిన్నచూపు అని కాంగ్రెస్ నాయకులు శంకర్ చంద్రే, బంక బాబుతో పాటు పలువురు మండిపడ్డారు. బైంసాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆనందరావు పటేల్ కు ఇవ్వడాన్ని సమర్థిస్తున్నామని, వలసవాదులకు డైరెక్టర్ పదవులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ముందుకు వచ్చి పార్టీ కోసం పనిచేసిన విషయాన్ని గుర్తె రగాలన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన వారంతా కాంగ్రెస్ అధికారం లోకి రాకుండా కుట్ర పన్నారని, వారికి డైరెక్టర్ పదవులు ఇవ్వడంతో అసలు కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరిగిందన్నారు. భైంసా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీలో ఎప్పటినుంచో కొనసాగుతున్న నాయకులు ఇవ్వకుండా నిన్న మొన్న కాంగ్రెస్ లో చేరిన వారికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. సత్వరమే అధిష్టానం కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అధిష్టానం వద్ద తాడోపేడో తేల్చుకుంటామన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు ఇవ్వకుండా అన్యాయం చేయడం ఏంటని వారు ప్రశ్నించారు. ఇదే తీరు కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment