రక్షకుడే భక్షకుడైన వేళ..!
జైలు సూపరింటెండెంట్ చింతల దశరథ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు
నిజామాబాద్, సెప్టెంబర్ 29 (మనోరంజని):
నిజామాబాద్ జిల్లా జైలు సూపరింటెండెంట్ చింతల దశరథ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలువడటంతో కలకలం రేగింది. ఈ ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్ స్వయంగా విచారణ చేపట్టారు. తాజాగా ఒక మహిళ ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు అయినట్టు సమాచారం. వీడియో కాల్ చేస్తేనే పేరోల్‌కు సహకరిస్తానని ఒక ఖైదీ సోదరిని వేధించాడని ఆరోపణలు వచ్చాయి. అంతేకాక, జైలుకు ములాకత్ కోసం వచ్చే ఖైదీల భార్యలను కూడా లైంగికంగా వేధించాడని ఫిర్యాదులు ఉన్నాయి. ఇదే మొదటిసారి కాదని, గతంలో చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేసే సమయంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయని తెలిసింది. ఇప్పుడు మళ్లీ అలాంటి ఆరోపణలే రావడంతో జిల్లా మెజిస్ట్రేట్ ఈ వ్యవహారంపై దృష్టి సారించారు.