Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 31
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కడెం ప్రాజెక్టును ఆకస్మికంగా సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం, ప్రస్తుత నీటి నిల్వ, లోనికి, బయటకు వెళ్తున్న నీటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కడెం ప్రాజెక్టును ఆకస్మికంగా సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం, ప్రస్తుత నీటి నిల్వ, లోనికి వస్తున్న నీటి ప్రవాహం, బయటకు విడుదల చేస్తున్న నీటి వివరాలను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, రానున్న రోజుల్లో కూడా వర్షాలు కొనసాగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రాజెక్టు దిగువ ప్రాంత గ్రామాల ప్రజలకు నీటి విడుదలపై ముందస్తు సమాచారం అందించి అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నీటిమట్టం, ప్రవాహ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు.
ప్రాజెక్టు గేట్లు, నీటి ప్రవాహ ప్రాంతాలు, ప్రమాదకర ప్రాంతాల్లోకి అనుమతి లేని వ్యక్తులు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. భవిష్యత్ అవసరాలు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి నిర్వహణను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
అనంతరం ఖానాపూర్ పట్టణంలోని హైటెక్ సిటీ మైనారిటీ వసతి గృహానికి వెళ్లే మార్గంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారిని పరిశీలించారు. వసతి గృహ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిత్యావసర వస్తువులు, అవసరమైన సామగ్రి నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ అంకం మౌనిక, నీటిపారుదల శాఖ అధికారులు జగదీష్, రాజేంద్ర ప్రసాద్, ప్రవీణ్ కుమార్, వీరన్న, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, తహశీల్దార్లు ఖాజా మొయినుద్దీన్, సుజాత, ఎంపీడీఓ రాధా రాథోడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.












