నిర్మల్, జూలై 30
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దేవేందర్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ దేవేందర్ రెడ్డి సూచించారు. అత్యవసర పరిస్థితులు తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని దేవేందర్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నిర్మల్ వైద్యులు డాక్టర్ దేవేందర్ రెడ్డి సూచించారు.
భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, చెరువుల సమీప ప్రాంతాలకు అత్యవసరం లేకుండా వెళ్లవద్దని ఆయన హెచ్చరించారు. వర్షపు నీటిలో విద్యుత్ తీగలు లేదా విద్యుత్ స్తంభాలు కనిపిస్తే వాటికి దూరంగా ఉండాలని సూచించారు.
అత్యవసర పరిస్థితులు మినహా ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. జ్వరం, దగ్గు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రి లేదా వైద్యులను సంప్రదించాలని తెలిపారు.
ప్రజలందరూ అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తే ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని డాక్టర్ దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు.












