VS Achuthanandan: 101 ఏళ్ల వయసులో మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత.. కమ్యూనిస్టు లోకం కన్నీరు..!!

VS Achuthanandan: 101 ఏళ్ల వయసులో మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత.. కమ్యూనిస్టు లోకం కన్నీరు..!!

VS Achuthanandan: 101 ఏళ్ల వయసులో మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత.. కమ్యూనిస్టు లోకం కన్నీరు..!!

VS Achuthanandan Death: స్వాతంత్య్ర సమరయోధుడు.. రాజకీయ కురువృద్ధుడు.. కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్‌ అచ్యుతానందన్‌ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.

ప్రజా ఉద్యమాల నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఆయన జీవితం ఎంతో ఆదర్శం. అతడి మృతితో కేరళలో తీవ్ర విషాదం అలుముకుంది. అతడి మృతిపై ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు సంతాపం ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలో కమ్యూనిస్టుల్లో అత్యంత కురువృద్ధుడిగా వీఎస్‌ అచ్యుతానందన్‌ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ సోమవారం కన్నుమూశారు. 101 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయన గత నెలలో గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. మొదట సీపీఐలో ఉన్న ఆయన అనంతరం జరిగిన చీలికతో సీపీఎం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా అచ్యుతానందన్‌ ఉన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment