మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం: కలుషిత నీటి సరఫరాపై గ్రామస్థుల ఆగ్రహం

Alt Name: మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం కలుషిత నీటి సమస్య
  • నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిగ్వ గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం కనుగొనబడింది.
  • వారం రోజులుగా అదే కలుషిత నీటిని సరఫరా చేయడంతో గ్రామస్థుల ఆందోళన.
  • అధికారుల నిర్లక్ష్యం పట్ల గ్రామస్థుల ఆగ్రహం.

 నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిగ్వ గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం దొరకడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. వారం రోజులుగా అదే కలుషిత నీటిని సరఫరా చేయడంతో గ్రామస్థులు అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

: నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిగ్వ గ్రామంలో మిషన్ భగీరథ పథకం ద్వారా సరఫరా చేసే నీటిలో కోతి కళేబరం కనుగొనబడింది. వారం రోజులుగా అదే కలుషిత నీటిని గ్రామస్తులకు సరఫరా చేస్తుండటంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకు నుంచి నీరుకు వాసన రావడంతో అనుమానించిన గ్రామస్థులు ట్యాంకులో పరిశీలించగా, అక్కడ కోతి కళేబరం కనిపించడంతో అవాక్కయ్యారు. ఈ దారుణ ఘటనపై గ్రామస్థులు మండిపడుతూ, ప్రభుత్వ అధికారులు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment