లంచం తీసుకుంటూ సంయుక్త సబ్ రిజిస్ట్రార్ పట్టుబాటు
ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖ సంయుక్త సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస రెడ్డి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఫిర్యాదుదారునికి అతని భార్య పేరు మీద గల ఒక గృహాన్ని తన పేరుమీద బహుమతి డీడ్ (Gift Deed) క్రింద నమోదు చేసేందుకు అధికారిక సహాయం చేస్తానని చెబుతూ, ఆయన నుండి ₹5,000/- లంచం స్వీకరించిన సమయంలో తెలంగాణ అనిశా (ACB) అధికారులు రెడ్ చేసి పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు అనిశా అధికారులు తెలిపారు.