అమెరికా అధ్యక్ష అభ్యర్థి కమలా హరిస్ పార్టీ కార్యాలయం పై కాల్పులు
హైదరాబాద్: సెప్టెంబర్ 25
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు చెందిన పార్టీ ప్రచార కార్యాలయం పై గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి తూపాకులతో ఫైరింగ్ చేసారు.
ఈ ఘటనలో ఆ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడం అందులో ఉన్న పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై జరిగిన కాల్పుల ఘటన మరువకముందే, ఇప్పుడు మరోసారి కాల్పులు జరిగాయి.
కమలా హారిస్ మరియు ట్రంప్, నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై దాడులు జరగడం సంచలనంగా మారింది. కాల్పుల ఘటనకు సంబంధించి కార్యాలయం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు, మరియు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అధికారులు, కిటీకిల నుంచి కాల్పులు జరిపినట్లు గుర్తించారు.