మనోరంజని తెలుగు టైమ్స్ – సారంగాపూర్ ప్రతినిధి, అక్టోబర్ 15, 2025
స్కూల్ బస్సు వెనక్కి తీస్తూ వృద్ధురాలిని ఢీ కొట్టిన ఘటన – నిర్మల్ జిల్లాలో విషాదం
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో స్కూల్ బస్సు వెనక్కి తీస్తూ వృద్ధురాలిని ఢీ కొట్టిన ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదంలో దేవి సాయమ్మ (80) అనే వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో బుధవారం ఉదయం దుర్ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు డ్రైవర్ జాదవ్ అంకుష్ పిల్లలను దించి బస్సును వెనక్కి తీస్తుండగా, ఇంటి ముందు నిలబడి ఉన్న దేవి సాయమ్మ (80)ను ఢీ కొట్టాడు.
ఈ ప్రమాదంలో సాయమ్మ తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే ఆమెను నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.