బాధిత కుటుంబాలను పరామర్శించిన టీఆర్‌ఎస్ ఇంఛార్జ్

బాధిత కుటుంబాలను పరామర్శించిన టీఆర్‌ఎస్ ఇంఛార్జ్

మనోరంజని ప్రతినిధి, సారంగాపూర్, సెప్టెంబర్ 20

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రానికి చెందిన మాజీ అడెల్లి ఆలయ చైర్మన్ నర్సాగౌడ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇటీవల ఆయన ఇద్దరు కుమారులు సుధాకర్ గౌడ్, నాగ గౌడ్‌లు మృతిచెందారు.ఈ విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్ ఇంచార్జ్ రామకృష్ణారెడ్డి శనివారం బాధిత కుటుంబాన్ని సందర్శించి పరామర్శించారు. మృతికి గల కారణాలను తెలుసుకుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.ఈ సందర్భంగా ఆయనతో పాటు మాజీ అడెల్లి పోచమ్మ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ దీవి శంకర్, జీవన్ రావు, చంద్రశేఖర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment