షాద్ నగర్ లో విషాదం యువకుడు ఆత్మహత్య
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం సోలిపూర్ చర్చి సమీపంలో చోటు చేసుకుంది. ఫరూఖ్ నగర్ మండల పరిధిలో గంట్లవెల్లి గ్రామానికి చెందిన పబ్బుల శివకుమార్ తండ్రి పబ్బుల బాలరాజ్ (33) రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్పియఫ్, జీఆర్ యఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది