నేటి రాశి ఫలాలు

మేషం

06-10-2024
శుభఫలితాలు కొనసాగుతున్నాయి. ఏ పని ప్రారంభించినా కలిసివస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూల ఫలితాలు వస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు గొప్ప లాభాన్ని ఇస్తాయి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనం వృద్ధి చెందుతుంది. ఇష్టదేవతా ధ్యానం శక్తిని ఇస్తుంది.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం

06-10-2024
మీ రంగాల్లో మీ శ్రమ ఫలిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులకు అడ్డుకట్టవేయాలి. మానసిక సంతృప్తి ఉంటుంది. ఈశ్వర ఆరాధన శుభప్రదం.

💑 మిధునం

06-10-2024
ప్రారంభించబోయే పనుల్లో ఓర్పు, సహనం, పట్టుదల అవసరం. ఉద్యోగంలో ఆచితూచి ముందుకు సాగాలి. పెద్దల నుంచి వచ్చిన సంపదను కాపాడుకోవాలి. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. ఈశ్వరారాధన శుభప్రదం.

🦀 కర్కాటకం

06-10-2024
ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. నిర్ణీత సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం.

🦁 సింహం

06-10-2024
సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. శ్రీలలితా దేవి నామస్మరణ శుభప్రదం.

💃 కన్య

06-10-2024
మనస్తాపం చెందకుండా మనోధైర్యంతో ముందుకు సాగాలి. బుద్ధిబలాన్ని ఉపయోగించి ఆటంకాలను అధిగమిస్తారు. ఆత్మీయులతో ఆచితూచి వ్యవహరించాలి. వినాయకుడిని ఆరాధిస్తే మంచిది.

⚖ తుల

06-10-2024
ప్రారంభించబోయే పనుల్లో తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల శీఘ్ర ఫలితాలు సొంతం అవుతాయి. ఉత్సాహంతో ముందుకు సాగి విజయవంతమైన ఫలితాలను అందుకుంటారు. ఇష్టదైవ శ్లోకాలు చదివితే మంచిది.

🦂 వృశ్చికం

06-10-2024
పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. అలసట పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం ఉత్తమం.

🏹 ధనుస్సు

06-10-2024
ఆత్మీయుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తారు. మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. శ్రీరామ నామాన్ని జపిస్తే మంచిది.

🐊 మకరం

06-10-2024
శుభకాలం. ఏ పనిని ప్రారంభించినా త్వరగా పూర్తవుతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. బంధు, మిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మికంగా శుభకాలం. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం శుభప్రదం.

🏺 కుంభం

06-10-2024
వృత్తి, ఉద్యోగాల్లో తోటివారి ప్రోత్సాహంతో అనుకున్నది సాధిస్తారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పట్టుదలతో ముందుకు సాగుతారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం.

🦈 మీనం

06-10-2024
మిశ్రమకాలం. మీ రంగాల్లో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శని ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.

Join WhatsApp

Join Now

Leave a Comment