వాహనదారులు నిబంధనలు తప్పక పాటించాలి

వాహనదారులు నిబంధనలు తప్పక పాటించాలి

కుంటాల మార్చి15: మండల కేంద్రంలోని కల్లూరు జాతీయ రహదారిపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నారి శక్తి (పోలీస్ అక్క) లో భాగంగా శనివారం బ్లూ కోల్డ్ మరియు పెట్రో కార్ విధులు WPC సరిత, అశ్విని పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు రోడ్లపై ప్రయాణం చేసే సమయంలో రోడ్డు భద్రత నిబంధనలు తప్పక పాటించాలని, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపరాదని అలాంటి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. రోడ్లపై ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వాహనాలు నడపకూడదని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని అలా చేస్తే వాన యజమానిపై కేసులను నమోదు చేస్తామని తెలియజేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment