తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు?

Theft at Bhatti Vikramarka's Residence
 

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు?

Theft at Bhatti Vikramarka's Residence

హైదరాబాద్: సెప్టెంబర్ 27

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం జరగడం కలకలం రేపింది. ఆయన విదేశీ పర్యటనలో ఉన్న క్రమంలో దొంగలు ఆయన ఇంటికి కన్నం వేశారు.

చోరీ చేసిన దొంగలను పశ్చిమ్‌ బెంగాల్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖరగ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో ఏడో నంబర్‌ ప్లాట్‌ఫాంపై జీఆర్పీ పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.

వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, తాము దొంగలమని ఒప్పుకొన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో దొంగతనం చేసినట్లు వారు తెలిపారు.

నిందితులు:
బిహార్‌కు చెందిన రోషన్‌కుమార్ మండల్‌, ఉదయ్‌కుమార్ ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు. వారి వద్ద బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు ఖరగ్‌పూర్ జీఆర్పీ ఎస్పీ దేబశ్రీ సన్యాల్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment