దారుణం.. మృత ఆడ శిశువును వదిలేసి వెళ్లిన మహిళ

Alt Name: మృత ఆడ శిశువు ఆసుపత్రి వద్ద

తేదీ: 18.10.2024
ప్రతినిధి: TG


కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో అమానవీయమైన ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగం పక్కన ఉన్న మహిళల మరుగుదొడ్ల వద్ద, అబార్షన్ అనంతరం మృత ఆడ శిశువును గుర్తుతెలియని మహిళ వదిలేసి వెళ్లింది.

ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికులు మృత శిశువును గుర్తించి డ్యూటీలో ఉన్న డాక్టర్ రమేష్ కు సమాచారం ఇచ్చారు. డాక్టర్ రమేష్ శిశువును పరిశీలించి, వెంటనే పోలీసులు మరియు వైద్యాధికారులకు సమాచారం అందించారు.

ఈ ఘటనపై స్థానికులకు అవమానం, ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఘటనకు సంబంధించిన విచారణ జరగాలి అనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment