ముగిసిన రియాజ్ కథ.. కానిస్టేబుల్ హత్య కేసులో కీలక పరిణామం….60కి పైగా రియాజ్ పై గతం లో కేసులు*

*ముగిసిన రియాజ్ కథ.. కానిస్టేబుల్ హత్య కేసులో కీలక పరిణామం….60కి పైగా రియాజ్ పై గతం లో కేసులు*

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్

ఆదివారం అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ పారిపోయే యత్నం

గన్ లాక్కోవడంతో పోలీసుల కాల్పులు

ఎన్‌కౌంటర్‌లో రియాజ్ అక్కడికక్కడే మృతి

ఆత్మరక్షణ కోసమే కాల్పులన్న పోలీసులు

రియాజ్‌పై 60కిపైగా బైక్ చోరీ, చైన్ స్నాచింగ్ కేసులున్నాయి. కాగా శుక్రవారం కానిస్టేబుల్ ప్రమోద్ ఇతడిని పట్టుకుని బైకుపై తీసుకెళ్తుండగా కత్తితో పొడిచి చంపి పారిపోయాడు. దీంతో పోలీసులు నిన్న సారంగపూర్ వద్ద రియాజ్‌ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో గాయాలు కాగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతో గన్ లాక్కొని పారిపోతుండగా ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు.

వివరాల్లోకి వెళితే… పోలీసుల కథనం ప్రకారం చికిత్స నిమిత్తం ఆసుప‌త్రిలో ఉన్న రియాజ్‌ను సోమవారం ఉదయం ఎక్స్‌రే కోసం తీసుకువెళ్తున్నారు. ఈ సమయంలో ఓ కానిస్టేబుల్ వద్ద నుంచి తుపాకీ లాక్కుని, అక్కడి నుంచి పారిపోయేందుకు అతను ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, ఆత్మరక్షణ కోసం అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

మూడు రోజుల క్రితం కానిస్టేబుల్ ప్రమోద్‌ను దారుణంగా హత్య చేసిన రియాజ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు ఆదివారం సారంగపూర్ అటవీ ప్రాంతంలోని ఓ లారీలో అతను దాక్కున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అతన్ని చుట్టుముట్టారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సమీపంలోని కాలువలోకి దూకినప్పటికీ, ఓ యువకుడి సహాయంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో గాయపడటంతో రియాజ్‌ను ఆసుప‌త్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వాస్తవానికి రియాజ్‌ను అరెస్ట్ చేసినప్పుడే ఎన్‌కౌంటర్ జరిగిందంటూ ప్రచారం జరిగింది. అయితే దీనిని నిజామాబాద్ సీపీ ఖండించారు. అరెస్ట్ సమయంలో సంయమనం పాటించామని, కానీ ఇప్పుడు ఏకంగా ఆయుధంతో దాడికి ప్రయత్నించడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. కాగా, కొద్దిరోజుల క్రితం రియాజ్‌ను బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా, అతను తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్‌పై దాడి చేసి పరారైన విషయం తెలిసిందే. ఈ ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది

Join WhatsApp

Join Now

Leave a Comment