- కొమురం భీం ఆసిఫాబాద్లో 11 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం.
- నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
- బాధిత కుటుంబ సభ్యులు ఫోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్.
ఆసిఫాబాద్ మండలం బూరు గూడ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు మద్యం మత్తులో ఉన్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిందితునికి కఠిన శిక్ష కోరుతూ రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మండలంలోని బూరు గూడ గ్రామంలో 11 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. పాఠశాల అనంతరం ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న బాలికను గమనించిన యువకుడు, మద్యం మత్తులో ఆమెను తన ఇంటికి బలవంతంగా తీసుకెళ్లి ఇంట్లో అత్యాచారానికి పాల్పడ్డాడు. అటుగా వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనను గమనించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు, వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఫోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించి, ఉరితీయాలని గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు, బాధిత కుటుంబ సభ్యులు కలిసి బూరుగూడ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.