మంత్రి కొండా సురేఖపై హై కమాండ్ ఆగ్రహం

కొండా సురేఖ వ్యాఖ్యలపై హై కమాండ్
  1. సీనీ ప్రముఖులపై వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ.
  2. ఢిల్లీ హై కమాండ్ ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది.
  3. సీనియర్లకు టెలిఫోన్ చేసి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై విచారణ.
  4. నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరిన అధిష్టానం.

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హై కమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సినీ ప్రముఖులపై సురేఖ వ్యాఖ్యలు చేయడంతో ఢిల్లీ నాయకత్వం ఆమెను తప్పుబట్టింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ, పార్టీకి గల నష్టం గురించి చర్చించేందుకు సీనియర్లకు ఫోన్లు చేశారు.

తెలంగాణ మంత్రి కొండా సురేఖ సినీ ప్రముఖులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి పెద్ద ఇబ్బంది తీసుకొచ్చాయి. ముఖ్యంగా నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో విమర్శలు ఎదురయ్యాయి. ఈ వ్యాఖ్యలను హై కమాండ్ తీవ్రంగా తప్పుబట్టింది. ఢిల్లీ పెద్దలు ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సీనియర్ నాయకులతో టెలిఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై క్షుణ్ణంగా విచారణ జరపాలని, సురేఖ చేసిన వ్యాఖ్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలని హై కమాండ్ కోరింది. “మూసీ అటూ, మూవీ ఇటూ” అంటూ ఆమె వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment