స్టోరీ పెద్దదే..చదివే కొద్దీ విస్తూ పోయే నిజాలు…ఆడ పిల్లల పాలిట వీళ్ళు యముడు లాంటి వాళ్ళు….న భయం.. న లజ్జ.

స్టోరీ పెద్దదే..చదివే కొద్దీ విస్తూ పోయే నిజాలు...ఆడ పిల్లల పాలిట వీళ్ళు యముడు లాంటి వాళ్ళు....న భయం.. న లజ్జ.

స్టోరీ పెద్దదే..చదివే కొద్దీ విస్తూ పోయే నిజాలు…ఆడ పిల్లల పాలిట వీళ్ళు యముడు లాంటి వాళ్ళు….న భయం.. న లజ్జ..లేదు వీళ్ళకి… ఒకడి టార్గెట్ 100.. మరొకడి టార్గెట్ 300.. మతి తప్పిన మదపిచ్చోళ్లు..వామ్మో ..ఆడ పిల్లలు అంటే వీళ్ళకి ఆట బొమ్మలా…పోలీసుల విచారణ లో షాక్ కి గురి చేసే నిజాలు

కామాతురాణాం నభయం నలజ్జ..

కామంతో కళ్లు మూసుకుపోయినవాడికి సిగ్గూ భయం రెండూ ఉండవు. మరి..

సమాజం పట్ల బాధ్యత ఉంటుందని ఎలా అనుకుంటాం..

ఎందుకు ఆశిస్తాం…?

అక్షరం ముక్క రానివాడైనా.. మాస్టర్స్‌ డిగ్రీ చదివినవాడైనా.. అందరిదీ అదే బాపతు.

ఎవ్వరికీ కనీస ఇంగితం లేదు. చట్టాలంటే భయం లేదు.

ప్రస్తుతానికి తెలుగురాష్ట్రాల్లో ఓ నలుగురు కామోన్మాదులపై ఇంట్రస్టింగ్ టాక్ నడుస్తోంది.

మతితప్పి, మదమెక్కిన కామ పిశాచుల స్వైరవిహారం సమాజంలో ఏ రేంజ్‌లో నడుస్తోందో తెలుస్తోంది.

వందమంది అమ్మాయిలే నా టార్గెట్‌ అంటాడొకడు.. ట్రిపుల్ సెంచరీ కొట్టాకే విశ్రమిస్తానంటాడు ఇంకొకడు.. అపరిచితుడి వేషం కట్టి నమ్మించి అమ్మాయిల మానప్రాణాల్ని పణంగా పెట్టి కోట్లు కొల్లగొడతాడు ఇంకొకడు.. వయసు మళ్లిన ముసలోళ్ల మీద కూడా అఘాయిత్యానికి పాల్పడతాడు మరొకడు.. పశువుల్ని కూడా వదిలిపెట్టనంత క్రూరంగా ఘోరంగా మతి తప్పి మదపిచ్చి పట్టి.. ఊరుమీద పడే తోడేళ్ల కథలు ఎన్నంటే ఏం చెప్పగలం..? ఇలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కామపిశాచులు రెచ్చిపోతున్నారు..

మగాళ్ల ముసుగుతన్ని.. ఆడపిల్లల పాలిట తోడేళ్లుగా మారుతున్న వైల్డ్ ఎనిమల్స్ మన సమాజంలో మన మధ్యనే మన చుట్టూనే యదేఛ్చగా తిరుగుతున్నారు. ఒక్కటొక్కటిగా బైటికొస్తున్న క్రైమ్ కహానీలు.. వాటి మాటున నక్కి ఉండే కామాంధుల కథలు.. నైతికంగా మనమెక్కడున్నామో నిగ్గదీసి అడిగేస్తున్నాయి. ఇటీవల తెలుగురాష్ట్రాల్లో వెలుగుచూసిన కొన్ని నికృష్టమైన ఉదంతాలు.. సమాజాన్ని చీడపురుగులు ఎంత పట్టిపీడిస్తున్నాయో అర్థమౌతోంది.

బత్తుల ప్రభాకర్.. మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్..
బత్తుల ప్రభాకర్.. మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్… 80కి పైగా కేసులున్న ఘరానా దొంగ.. మూడేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతూ.. ఎట్టకేలకు గచ్చిబౌలిలోని ఓ పబ్బులో దొరికాడు. పోలీసులపైనే ఫైరింగ్ చెయ్యబోయి.. అరెస్టయ్యాడు. రిమాండ్‌కు తరలించారు. అతగాడుండే రూమ్‌కి వెళ్లి వాడి క్రిమినల్ నేచర్ చూసి పోలీసులే షాకయ్యారు. నెలకు లక్ష రూపాయలు అద్దె ఇస్తూ.. ఖరీదైన ఇంట్లో లావిష్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ప్రభాకర్‌కి సినీ ఫక్కీలో రెక్కీ నిర్వహించి సింగిల్‌గానే దొమ్మీలు, దోపిడీలు చేయడం హాబీ..

ఇంతేకాదు.. బత్తుల ప్రభాకర్ అనే ఈ నేరగాడికి ఇంకో మాయరోగం కూడా ఉంది. అతడి ఛాతీ మీదుండే టాటూల్ని డీకోడ్ చేస్తే.. విస్తుగొలిపే విషయాలు తెలిసొచ్చాయి. ముఖ్యంగా ఎడమవైపు ఆఠీను గుర్తుతో కూడిన ఆ వన్‌డబుల్‌జీరో కథేంటి..? వందమంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఎంజాయ్ చేయాలన్నది తన టార్గెట్టట. గుండెల మీద పచ్చబొట్టు పొడిపించుకుని మరీ టార్గెట్ పెట్టుకున్నాడంటే.. ఈ కామాంధుడి మురికి లీలామృతం ఏ పాటిదో అర్థమౌతోంది. ఇప్పటిదాకా ఎంతమంది ఆడపిల్లల జీవితాల్ని కబళించాడు.. వీడి రాడార్‌లో ఇంకెంతమంది అమ్మాయిలున్నారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

మస్తాన్‌ సాయి.. వీడో కసాయి గాడు..
మస్తాన్‌ సాయి అనే ఇంకొకడి టార్గెట్టయితే అంతకుమించి. ఏకంగా 300 మంది అమ్మాయిల పరువుని బ్లూఫిలింస్‌లో దాచిపెట్టాడీ కసాయిగాడు. లావణ్య-రాజ్‌తరుణ్ లవ్వాయణంలో వెలుగుచూసిన ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ పేరే పేరు మస్తాన్ సాయి. ఇంతవరకూ లావణ్య వైవాహిక జీవితంలో మాత్రమే తనదైన పాత్ర పోషించిన ఇతగాడి మీద లేటెస్ట్‌గా మరో కేసు నమోదైంది. ఆ కేసు డీటెయిల్స్ చూస్తే.. కళ్లు బైర్లు గమ్ముతాయి..

వందకాదు రెండొందలు కాదు.. ఏకంగా 300మంది అమ్మాయిల బతుకుల్ని బజారుకీడ్చిన శాల్తీ ఇది. ప్రేమ పేరుతో ఆడపిల్లల్ని ముగ్గులోకి దింపడం.. పెళ్లి చేసుకుంటానని.. యూట్యూబ్‌లో అవకాశాలిస్తానని ఆశ పెట్టడం.. ఇదీ వీడి వెలగబెడుతున్న ప్రొఫెషన్. కొందరమ్మాయిల్ని శారీరకంగా వాడుకుని, డ్రగ్స్‌కి బానిసలుగా మార్చి.. వీడియోకాల్స్‌ ద్వారా అశ్లీల చేష్టలకు పాల్పడి సదరు వీడియోల్ని తన దగ్గర భద్రపర్చుకోవడం.. ఇదే ఇతగాడి మేనరిజం..

బాత్రూముల్లో, బెడ్‌రూముల్లో స్పైకెమెరాలతో రికార్డ్ చేసిన వీడియోల్ని హార్డ్‌డిస్క్‌లో దాచుకున్నాడు. తనతో సన్నిహితంగా మెలిగిన అమ్మాయిల వ్యక్తిగత రహస్యాలన్నీ వీడి మెమరీ కార్డులో ఉండిపోయాయి. ఎవరైనా ఎదురుతిరిగి ప్రశ్నిస్తే వీడియోల్ని పబ్లిక్‌లో పెడతానని బ్లాక్‌మెయిల్‌కి దిగుతాడు. రాజ్‌తరుణ్ కేసులో ఆధారాల కోసం మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ తీసుకున్న లావణ్యకు… అందులో ఉన్న వీడియోల్ని చూశాక మైండ్ బ్లాకైంది. 300 మంది అమ్మాయిల వీడియోలున్న ఆ హార్డ్ డిస్క్ ఇప్పుడు నార్సింగి పోలీసుల హ్యాండోవర్లో ఉంది. మస్తాన్ సాయి ట్రాప్‌లో చిక్కిన ఆ 300 మంది అమ్మాయిలిప్పుడు బితుకుబితుకుమంటూ బతుకుతున్నారు.

పేరు దేవనాయక్.. అపరిచితుడి క్యారెక్టర్..
పేరు దేవనాయక్. ఈ కథలో వీడిది అపరిచితుడి క్యారెక్టర్. ఒక అమాయక మహిళను స్నేహం పేరుతో నమ్మించి, న్యూడ్ వీడియోలు తీసి, బెదిరించి కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు. హైదరాబాద్‌ అమ్మాయి.. నిడదవోలు అబ్బాయి. ఇదీ కథ పేరు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ విమెన్స్ హాస్టల్‌లో ఉంటున్న ఒకమ్మాయికి అనూష అనే మరొకమ్మాయి పరిచయమైంది. ఆమె ద్వారా పరిచయమైన మరోకడు దేవనాయక్. మాటామాటా కలిపి.. ఎనీటైమ్ ఏదైనా అవసరమొస్తే చెప్పు.. ఆదుకుంటా అంటూ ఆపద్బాంధవుడిలా ఫోజు కొట్టేవాడు.. ఆ తర్వాత ప్లాన్ ను అమలు చేసేవాడు..

వన్ ఫైన్ మార్నింగ్ ఒక అగంతకుడి నుంచి ఫోన్ కాల్.. నీ న్యూడ్ ఫోటోలు నా దగ్గరున్నాయని బెదిరింపు. అడిగినంత ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్‌మెయిల్..! భీతావహురాలైన అమ్మాయి.. సాయం కోసం దేవనాయక్‌ను ఆశ్రయించింది. వాడి అంతు చూస్తా.. సెటిల్ చేస్తా అంటూ నమ్మబలికాడు దేవనాయక్. ఇదే అదనుగా.. కొంత ఖర్చవుతుంది అంటూ ఆమె దగ్గరనుంచి డబ్బులు రాబట్టుకోసాగాడు. సెటిల్మెంట్ విషయంలో గొడవ జరిగిందని, దెబ్బలు తగిలాయని, ఆస్పత్రి ఖర్చులని చెప్పి మరికొంత డబ్బు తీసుకున్నాడు. తీరా ఆరా తీస్తే.. ఫోన్ చేసి బెదిరించిన అగంతకుడే ఈ దేవాంతకుడని, అసలు సూత్రధారి ఈ అపరిచితుడేనని తెలిసి షాకయింది ఆ అమ్మాయి. నిడదవోలు పోలీసులు ఆశ్రయించి.. జరిగిందంతా చెప్పేసింది. కానీ.. అప్పటికే న్యూడ్‌ఫోటోల్ని చూపెట్టి.. 2 కోట్ల 53 లక్షలు లాగేసుకున్నాడు.

ఒక మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. బ్లాక్‌మెయిల్‌కి పాల్పడి ఈ రేంజ్‌లో దగా చేసిన దేవనాయక్.. ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అతగాడి నుంచి కోటీ 81 లక్షలు రికవరైంది.

మానవ మృగం.. ఒంటరిగా ఉన్న వృద్దురాళ్ళే వీడి టార్గెట్
వీడి పేరు మంజు.. కేరాఫ్ గుంటూరు జిల్లా పెదనందిపాడు. మద్యానికి బానిసై ఒళ్లు కొవ్వెక్కి.. కళ్లనిండా కామక్రోధాలు నింపుకుని.. జులాయిగా తిరుగుతుంటాడు. ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలపై తెగబడి అత్యాచారం చేసి హతమారుస్తాడు. 2023లో 85 ఏళ్ళ వృద్ధురాలిపై అత్యాచారం చేస్తే.. ఆమె తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. గత ఏడాది మార్చిలో మరొక వృద్ధురాలిని కూడా ఇలాగే చేశాడు. ఈ కేసులో రిమాండ్ ఖైదిగా ఉన్న మంజు ఈ నెల 1న బెయిల్‌పై విడుదలయ్యాడు. వీడు జైలుకెళ్లొచ్చినా వాడిలోపలుండే మృగం అలాగే ఉంది.

పెదనందిపాడులో ఒక గుడిలో పనిచేసే రమణమ్మ అనే ముసలావిడ చనిపోయింది‌. ఆమె మెడపై తీవ్ర గాయాలుండడంతో అనుమానమొచ్చి పోలీసులు ఆరా తీశారు. ఆ ఇంటి సమీపంలోనే మంజు, అతని స్నేహితుడు సాంబ ఉండటంతో అనుమానం బలపడింది. స్థానికులిచ్చిన సమాచారం మేరకు ఫిర్యాదు రాసుకుని దర్యాప్తు చేస్తే.. రమణమ్మపై అత్యాచారం చేసింది మంజునే అని తేలింది. వాడి పేరు తలిస్తేనే వణుకుతోంది పెదనందిపాడు గ్రామం.

ఇలా కామ పిశాచులు పేట్రేగి పోవడం.. తెలుగు రాష్ట్రాల్ని కలవర పెడుతోంది. మతి తప్పిన.. మదమెక్కిన కామాంధులు ఎక్కడెక్కడ నక్కివున్నారో.. ఎప్పుడు ఎలా ఎవరి మీద తెగబడతారో అని బెదిరిపోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా అమ్మాయిల జీవితాలను నాశనం చేయడానికి టార్గెట్ పెట్టుకుని మరీ వేటాడుతున్న తోడేళ్ల గురించి జనంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

సమాజంలో నేరాలు-ఘోరాలు ఎంత ముదిరిపోతున్నాయంటే.. మహిళపై అత్యాచారం చేసి హతమార్చారన్న వార్తల్ని ఇవాళారేపూ రెగ్యులర్‌గా వింటున్నాం. దానికి హత్యాచారం అని మనకు మనమే కొత్త పేరు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఢిల్లీ నిర్భయ నుంచి కోల్‌కతా ఆర్జీకర్ హాస్పిటల్ కేసు దాకా.. ఎన్నో చేదు జ్ఞాపకాలు.. అన్నీ అత్యంత క్రూరమైన నేరాలే. ఎక్కడో కాదు.. ఇక్కడ.. మన మధ్యనే యధేచ్ఛగా తిరుగుతున్న ఇటువంటి మానవమృగాల పట్ల అప్రమత్తంగా ఉండడం ఎలా? వీళ్లను బోనెక్కించడానికి మనకుండే చట్టాలు సరిపోతాయా..?

వందమంది అమ్మాయిల్ని ట్రాప్‌ చేయాలని కలలు గన్న బత్తుల ప్రభాకర్.. 300 మంది అమ్మాయిల న్యూడ్‌ వీడియోలతో వాళ్ల బతుకుల్ని శాసించబోయిన మస్తాన్ సాయి.. న్యూడ్‌వీడియోల పేరుతో బ్లాక్‌మెయిల్‌ చేసి సొమ్ములు వెనకేసుకున్న దేవనాయక్‌.. గంజాయి మత్తులో వృద్ధ మహిళపై పైశాచికత్వానికి పాల్పడే మంజు..! ప్రస్తుతానికి ఈ నలుగురూ శాంపిల్ పీస్‌లే. ఒకడు హైక్లాస్ ఐతే మరొకడు ఊర మాస్. క్రైమ్ నేచర్‌లో ఒక్కొక్కడిదీ ఒక్కో రేంజ్! లక్ష్యం మాత్రం ఒక్కటే.. మహిళల మాన ప్రాణాల్ని కబళించడం. చదువుకున్నవాళ్లూ, చదువుకోనివాళ్లూ అన్న తారతమ్యం లేదిక్కడ. అందరిలోనూ వేళ్లూనుకుపోయిన ఈ నేర ప్రవృత్తికి కారణమేంటి..?

పెళ్లిచేసుకుంటామని నమ్మించి శారీరకంగా వాడుకునే ఉదంతాల్లో ఛోటామోటా సెలబ్రిటీలే ఎక్కువగా ఉన్నారన్నది ఒక రిమార్క్. ఇప్పుడు మస్తాన్ సాయి చేతిలో అలా మోసపోయిన కేసే లావణ్యది. అది లవ్వా లేక లస్టా.. వాడు ఒలకబోసేది ప్రేమా లేక కామమా.. తెలుసుకునేలోగా జరగరానిదంతా జరిగిపోతుంది. కేటుగాడి చేతిలో మోసపోడానికి ఒక వస్తువుగా మారిపోతోంది సగటు అమ్మాయి. ప్రేమలో నిండా మునిగినప్పుడు.. ఫోటోలు-వీడియోలంటూ వెర్రిపనులకు సరెండరై ఆనక మోసపోవద్దన్నది సైకాలజిస్టుల సూచన. నేరానికి పాల్పడ్డవాడు కొద్దోగొప్పో పేరు-పరపతి ఉంటే లీగల్‌గా సేఫ్‌సైడ్‌లో ఉంటాడు. ఆ మేరకు ముందే ప్లాన్ చేసుకుంటాడు. ఒకవేళ అరెస్టయినా ఈజీగానే స్టేషన్ బెయిల్ తెచ్చుకుంటాడు. ఏతావాతా దగా పడేది మాత్రం అమాయకపు అమ్మాయిలే

Join WhatsApp

Join Now

Leave a Comment