బ్యాగులో బుల్లెట్‌తో మెట్రోకు వచ్చిన బాలుడు
ప్రగతి నగర్‌కు చెందిన 12ఏళ్ల బాలుడి సంచలన చర్య
హైదరాబాద్, అక్టోబర్ 20 (M4News):
ప్రగతి నగర్‌కు చెందిన 12 ఏళ్ల బాలుడు ఇంట్లో ఉండడం ఇష్టం లేక బయటకు వెళ్లి మూసాపేట్ మెట్రో స్టేషన్‌కి చేరాడు. అయితే చెకింగ్ సమయంలో అతని బ్యాగులో 9MM బుల్లెట్ కనిపించడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
తక్షణమే మెట్రో ఇంచార్జ్‌కు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాలుడు తన తాత మిలిటరీలో పని చేసేవారని, ఇంట్లో ఉన్న బుల్లెట్‌ను అజాగ్రత్తగా బ్యాగులో పెట్టుకున్నానని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు