🔹 కావాలనే అందరి ఎదుట అవమానించాలనే ఉద్దేశంతో దూషిస్తేనే ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తిస్తుంది.
🔹 నాలుగు గోడల మధ్య జరిగిన ఘటనకు అట్రాసిటీ చట్టం వర్తించదని సుప్రీంకోర్టు తీర్పు.
🔹 తమిళనాడుకు చెందిన వ్యక్తిపై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
🔹 మద్రాస్ హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం.
🔹 కార్యాలయంలో జరిగిన ఘటన అట్రాసిటీ చట్టం కింద రాదని స్పష్టం చేసిన న్యాయస్థానం.
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులను అందరి ముందు కావాలని అవమానించాలనే ఉద్దేశంతో దూషించినప్పుడే అట్రాసిటీ చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నాలుగు గోడల మధ్య జరిగిన సంఘటనలకు ఈ చట్టం వర్తించదని తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తిపై నమోదైన కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. మద్రాస్ హైకోర్టు తీర్పును రద్దు చేసిన ధర్మాసనం, ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్లు వర్తించవని వెల్లడించింది.
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులను అవమానించాలనే ఉద్దేశంతో అందరి ముందూ కావాలని దూషించినప్పుడే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టడం సాధ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు తమిళనాడుకు చెందిన వ్యక్తిపై నమోదైన కేసు విచారణ సందర్భంగా వెలువడింది.
కేసు వివరాలు:
2021 సెప్టెంబరులో భూమి పట్టా మార్పుపై వివరాలు తెలుసుకోవడానికి తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి స్థానిక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కార్యాలయానికి వెళ్లాడు. ఈ సందర్భంగా అధికారితో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ అధికారికుడి ఫిర్యాదు మేరకు నిందితుడు తన కులాన్ని ప్రస్తావిస్తూ దూషించాడని, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసు తిరుచిరాపల్లి కోర్టులో నడిచింది. అయితే, నిందితుడు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడి బెంచ్ విచారణను కొనసాగించాలని తీర్పునిచ్చింది. దీంతో బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
సుప్రీంకోర్టు ధర్మాసనం (జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ మాహి్‌స) ఈ కేసును విచారించి, “ఘటన జరిగినప్పుడు అక్కడ ఏ ఇతర వ్యక్తులు లేరు. ఘటన తర్వాతే సహోద్యోగులు అక్కడికి వచ్చారు. కాబట్టి ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(1)(ఆర్), సెక్షన్ 3(1)(ఎస్) వర్తించవు” అని తీర్పునిచ్చింది.
దీంతో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతూ, నిందితుడిపై నమోదైన చార్జ్‌షీట్‌ను రద్దు చేసింది.