యువకుడి ప్రాణం తీసిన టెంకాయ
మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. సంజయ్ భోయిర్ అనే యువకుడు టెంకాయ తగిలి మరణించాడు. సంజయ్ నాట్గావ్ రైల్వే స్టేషన్ దగ్గర రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. రోడ్డు పక్కనే రోడ్డు పక్కనే రైల్వే బ్రిడ్జి ఉంది. అదే సమయంలో రైలులోంచి ఓ వ్యక్తి పూజల కోసం ఉపయోగించిన వస్తువులు ఉన్న మూటను బయటకు విసిరేశాడు. ఆ మూటలో టెంకాయ కూడా ఉంది. ఆ మూట నేరుగా వచ్చి సంజయ్ తలపై పడింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు