ఎయిర్టెల్ యూజర్లకు ముఖ్యమైన సూచన. టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన నెట్‌వర్క్‌లో పలు కీలక మార్పులను ప్రవేశపెట్టనుంది. ఈ మార్పులలో భాగంగా, అపరిమిత 5G డేటా ఆఫర్‌ను స్మార్ట్‌ఫోన్ వినియోగానికి మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అపరిమిత 5G డేటా ఆఫర్ ఇకపై స్మార్ట్ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది. అంటే, వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్ హాట్‌స్పాట్ ద్వారా ఇతర పరికరాలకు 5G స్పీడ్‌తో ఇంటర్నెట్ను షేర్ చేయలేరు. ఇతర గ్యాడ్జెట్లకు 5G హాట్‌స్పాట్ సేవలు కావాలంటే, ఎయిర్టెల్ ప్రత్యేకంగా ఒక ప్లాన్‌ను తీసుకురానుంది.
నెట్‌వర్క్‌పై పడుతున్న భారాన్ని తగ్గించడం, సేవల నాణ్యతను మెరుగుపరచడం ఈ మార్పుల వెనుక ప్రధాన ఉద్దేశ్యాలుగా ఎయిర్టెల్ పేర్కొంది. దీంతోపాటు, ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) కింద వినియోగదారులకు 300GB డేటాను ఉచితంగా అందించిన తర్వాత, వారి ఇంటర్నెట్ స్పీడ్‌ను తగ్గించనుంది. ఈ కొత్త నిబంధనలు ఎప్పటినుంచి అమలులోకి వస్తాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.










