శ్రీహరికోట (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 18
భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచే రోజు నేడు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన 'విక్రమ్-1' అనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్‌ను శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. 'ఆగమన్' మిషన్ పేరుతో ఈ ప్రయోగం జరగనుంది. ఇది దేశ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.
భారత అంతరిక్ష పరిశోధన రంగంలో నేడు సరికొత్త అధ్యాయం ఆవిష్కృతం కానుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ 'స్కైరూట్ ఏరోస్పేస్' రూపొందించిన 'విక్రమ్-1' రాకెట్‌ను ఈరోజు శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. 'ఆగమన్' అనే పేరుతో ఈ మిషన్ సాగనుంది. భారత్‌లో ఒక ప్రైవేట్ సంస్థ నిర్మించి, ప్రయోగించనున్న తొలి ఆర్బిటల్ రాకెట్ ఇదే కావడం విశేషం. ఈ రాకెట్ సుమారు 350 కిలోల బరువున్న ఉపగ్రహాలను భూమికి సమీప కక్ష్యలోకి (లో-ఎర్త్ ఆర్బిట్) తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది.











